ETV Bharat / crime

బీజేపీ నాయకుడి హత్య కేసు.. ఐదుగురు వైసీపీ వర్గీయులు అరెస్ట్​ - ఆంధ్రప్రదేశ్​ నేర వార్తలు

YCP ACTIVISTS ARREST IN MURDER CASE: కర్నూలులో బీజేపీ నాయకుడు శివకుమార్‌గౌడ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో ఐదుగురు వైసీపీ వర్గీయులను అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ వినోద్​ కుమార్​ తెలిపారు.

YCP ACTIVISTS ARREST IN MURDER CASE
YCP ACTIVISTS ARREST IN MURDER CASE
author img

By

Published : Jan 12, 2023, 3:25 PM IST

YCP ACTIVISTS ARREST IN MURDER CASE : కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంభళానూరు గ్రామంలో ఈనెల 7వ తేదీన బీజేపీ నాయకుడు ఈడిగ శివ కుమార్ గౌడ్ హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని కల్లు దుకాణం దగ్గర శివకుమార్​ కళ్లలో అతి కిరాతకంగా కారం పోసి, వేటకొడవళ్లతో వైసీపీ వర్గీయులు హతమార్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు వైసీపీ వర్గీయులను అదుపులో తీసుకున్నారు. శివ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రామన్న గౌడ్, అతనితో పాటు మరో నలుగురుని అదుపులో తీసుకున్నామని డీఎస్పీ వినోద్​ తెలిపారు.

ఇదీ జరిగింది: కుంభలనూరుకు చెందిన బీజేపీ నాయకుడు ఈడిగ శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. కుంభళనూరు గ్రామంలోని ఓ కల్లు దుకాణం దగ్గర గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి, వేట కొడవళ్లతో తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తలకు తీవ్రగాయాలు కావడంతో ఈడిగ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు 8 నెలల క్రితం నదిచాగి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామన్న గౌడ్ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 4 నెలల క్రితం వైసీపీ వర్గపోరుతో బీజేపీలో చేరాడు. ఈ క్రమంలో ఈడిగ శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురికావడంతో జిల్లావ్యాప్తంగా కలకలం రేగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువులతో హత్యకు గల కారణాలపై డీఎస్పీ వినోద్ కుమార్ ఆరా తీశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.