ETV Bharat / crime

ప్రభుత్వ శాఖల ఎఫ్​డీల మాయంపై కొనసాగుతున్న దర్యాప్తు.. వారి హస్తముందా..? - fd scam in ap investigation

fd scam in ap
fd scam in ap
author img

By

Published : Oct 16, 2021, 1:14 PM IST

Updated : Oct 16, 2021, 2:06 PM IST

13:05 October 16

ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీల మాయంపై కొనసాగుతున్న దర్యాప్తు.. బ్యాంకు సిబ్బంది సహకారంతో కుంభకోణం జరిగినట్లు నిర్ధరణ

 ప్రభుత్వ శాఖల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాయంపై దర్యాప్తు కొనసాగుతోంది. వేర్‌ హౌసింగ్, ఆయిల్‌ఫెడ్‌ సంస్థల్లో రూ.14.50 కోట్ల ఎఫ్‌డీలు మాయమయ్యాయి. స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో రూ.9 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టారు. ఏపీ ఆయిల్‌ఫెడ్‌ సంస్థలో రూ.5 కోట్ల డిపాజిట్లు మాయమయ్యాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంపై  భవానీపురం, ఆత్కూరు పోలీస్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ఐవోబీ, సప్తగిరి బ్యాంకుల్లోని ఎఫ్‌డీలను కొల్లగొట్టి.. నిందితులు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు.

 ఎఫ్‌డీలకు సంబంధించి డాక్యుమెంట్లు, సమాచారాన్ని పోలీసులు.. బ్యాంక్​ అధికారులను కోరారు. మాయమైన సొమ్ము చెల్లించేందుకు  బ్యాంకులు అంగీకరించాయి. బ్యాంకులో మాయమైన ఎఫ్‌డీ నిధులను ఐవోబీ బ్యాంక్​ వెనక్కు ఇచ్చింది. గిడ్డంగుల శాఖకు చెందిన రూ.9.60 కోట్లు మాయమవ్వగా.. గిడ్డంగులశాఖ ఖాతాలో ఐవోబీ రూ.9.60 కోట్లు డిపాజిట్ చేసింది. వడ్డీ డబ్బులు కూడా చెల్లిస్తామన్న ఐవోబీ యాజమాన్యం స్పష్టం చేసింది. బ్యాంకు సిబ్బంది సహకారంతో కుంభకోణం జరిగినట్లు అధికారులు నిర్ధరించారు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారుల దర్యాప్తు చేస్తున్నారు.

'ఎఫ్‌డీల మాయంపై ఫిర్యాదులు వచ్చాయి. రూ.14.60 కోట్ల ఎఫ్‌డీలు మాయమైనట్లు ఫిర్యాదులు అందాయి. సీసీఎస్ ద్వారా 2 కేసులను దర్యాప్తు చేయిస్తున్నాం. ఫోర్జరీ డాక్యుమెంట్లు, సంతకాలతో నిధులు మళ్లించినట్లు ఫిర్యాదు వచ్చాయి. ఆయిల్‌ఫెడ్‌లో మేలో ఎఫ్‌డీలు మాయమైనట్లు ఫిర్యాదు వచ్చింది. మార్క్‌ఫెడ్‌లో గతేడాది ఎఫ్‌డీలు మాయమైనట్లు ఫిర్యాదు అందింది. ఈ కేసులో.. తెలుగు అకాడమీ కేసు నిందితులకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్నాం. సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాం. డీసీపీ హర్షవర్దన్ 2 కేసులను దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, సహకరించిన వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నాం. హైదరాబాద్‌ అధికారులతోనూ మాట్లాడుతున్నాం. తెలుగు అకాడమీ కేసు డాక్యుమెంట్లను పరిశీలిస్తాం.' విజయవాడ సీపీ శ్రీనివాసులు

ఇదీ చదవండి: 

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి

Last Updated : Oct 16, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.