Murder : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో దారుణహత్య జరిగింది. చిన్న అనే 24 ఏళ్ల యువకుడ్ని పాత కక్షల నేపథ్యంలో కత్తితో పొడిచి హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమరిపాలెం గ్రామానికి చెందిన చిన్న, ధర్మ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో కేక్ కట్చేస్తుండగా మరో సారి వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు గొడవకు దిగారు. పెద్దలు కలగజేసుకుని ఇద్దర్ని సముదాయించి గొడవ ప్రాంతం నుంచి పంపించేశారు. మళ్లీ అదివారం ఉదయం ధర్మ ఇద్దరు యువకులతో కలిసి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంతో అతనిని కత్తితో పొడవటంతో చిన్న ప్రాణాలు కోల్పొయాడని స్థానికులు అంటున్నారు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కేమెరాలో నిక్షిప్తమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :