ETV Bharat / crime

murder: కోడలిని కత్తితో నరికి హత్య చేసిన మామ - medicharlapalem murder news

కోడలిని నరికి చంపిన మామ
కోడలిని నరికి చంపిన మామ
author img

By

Published : Jul 30, 2021, 9:29 PM IST

Updated : Jul 31, 2021, 2:39 AM IST

21:24 July 30

కోడలిని దారుణంగా హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన మామ

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబం పరువు తీసిందన్న కోపంతో తన కోడల్ని మామ హత్య చేశారు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మలికిపురం ఎస్సై నాగరాజు వెల్లడించారు. గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణ... కుమారుడు విజయకుమార్​కు ప్రియమణి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. అయితే విజయకుమార్​.. ఉపాధి నిమిత్తం గల్ఫ్​లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రియమణి స్థానికంగా ఉన్న వేరే సామాజిక వర్గానికి చెందిన ఓ యువడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే 6ఏళ్లు తన కుమారుడుతో అత్తమామలతో కలిసి ఉంటున్న ప్రియమణి.. పది రోజుల క్రితం ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఈమేరకు సత్యనారాయణ.. మలికిపురం స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు వాళ్లిద్దరిని పట్టుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ప్రియమణిని సత్యనారాయణ ఇంటికి పంపించారు.

మామ.. కోడలు మధ్య వాగ్వాదం

ఈ నేపథ్యంలో తిరిగి ఇంటికి వెళ్లిన కోడలు.. మామ మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిత్తుడైన సత్యనారాయణ.. ప్రియమణిపై కత్తితో దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన ప్రియమణి తల్లి మంజులకు స్వల్ప గాయలయ్యాయి. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్​ వచ్చి లొంగిపోయాడు. ఇంటి పరువు తీస్తుందనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసి రాజోలు సీఐ దుర్గాశేకర్​ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

 RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం

Last Updated : Jul 31, 2021, 2:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.