SUICIDE: వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. యర్రగుంట్లలోని నీటిగుంతలోకి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6)గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు పెద్ద ఎత్తున ఘటనస్థలికి చేరుకున్నారు. పోలీసుల సహాయంతో గజ ఈతగాళ్లు ముగ్గురి మృతదేహాలను బయటికు తీశారు. కుటుంబ కలహాలతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మూడు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: