ETV Bharat / crime

Maoists fire landmine: మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. - ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

Maoists fire landmine: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు.

మందుపాతర పేల్చిన మావోయిస్టులు
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
author img

By

Published : Dec 15, 2021, 6:20 PM IST

Maoists fire landmine: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్​ ఆర్​ఎస్​ఐకు గాయాలయ్యాయి.

ఇప్పటికే తెలంగాణ - ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో మావోయిస్టుల చొరబాట్ల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టులు తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్​పీఎఫ్​ బలగాలతో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కలిసి కూంబింగ్‌ నిర్వహించడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులను పట్టుకునేందుకు అదనపు బలగాలను ఉన్నతాధికారులు ఆ ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చదవండి: Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.