ETV Bharat / crime

Murder Attempt on Young Woman: అర్ధరాత్రి ఇంటికొచ్చి డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం - గచ్చిబౌలిలో యువతిపై యువకుడి హత్యాయత్నం

తాగిన మత్తులో అర్ధరాత్రి ఓ యువతి ఇంటికి వచ్చిన యువకుడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆమె అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్​ వట్టినాగులపల్లిలో చోటు చేసుకుంది.

Murder Attempt
Murder Attempt
author img

By

Published : Oct 28, 2021, 10:38 AM IST

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. యువతి అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, బంధువులు.. యువకుడిని చితకబాది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

వట్టి నాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్ కేపీహెచ్​బీలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయి మాదాపూర్‌లో ఫైన్ ఆర్ట్స్​ కళాశాలలో చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి ప్రేమ్​సింగ్ తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. యువతికి స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాగిన మైకంలోనే యువకుడు హత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన ప్రేమ్‌సింగ్‌ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

Murder Attempt on Young Woman
అర్ధరాత్రి ఇంటికొచ్చి డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం

"అర్ధరాత్రి 2 గంటల సమయంలో మా ఇంటికి వచ్చి నా చెల్లెలును చంపేందుకు ప్రయత్నించాడు. మెయిన్ డోర్​ నుంచి డైరెక్ట్​గా నా చెల్లి గదిలోకి వెళ్లి గడియ పెట్టాడు. తర్వాత కత్తి తీసి తన నోరు మూసి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో అందరం లేచాం. వెళ్లి చూస్తే తను చెల్లి గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నాడు.. వెంటనే మేం అతణ్ని పట్టుకుని కొట్టాం. తర్వాత పోలీసులకు అప్పజెప్పాం. తను దూరపు బంధువని అమ్మానాన్న చెప్పారు. కానీ నాక్కూడా తెలియదు అతనెవరో."

- బాధితురాలి సోదరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.