ETV Bharat / crime

Man Killed Girl friend: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు - Man Murdered Girlfriend in Manakondur

Man Killed Girlfriend in Karimnagar: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ప్రియుడే హతమార్చిన ఘటన.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్​ మండలం చెంజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వచ్చేయమన్నాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో దారుణంగా హతమార్చాడు. యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ హత్యకేసును ఛేదించారు.

Man Killed Girlfriend in Karimnagar
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
author img

By

Published : Jan 8, 2022, 6:49 PM IST

Man Killed Girlfriend in Karimnagar : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపెల్లికి చెందిన వరలక్ష్మి(19) పక్కనే ఉన్న పోరండ్ల గ్రామానికి చెందిన అసోద అఖిల్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ సంగతి తెలిసిన పెద్దలు ఇద్దరిని మందలించారు. ముందు చదువుపై దృష్టి పెట్టమని.. మంచి ఉద్యోగం సంపాదించక ఈ ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించండని నచ్చజెప్పారు. అయినా వినని అఖిల్.. పెళ్లిచేసుకుందామని వరలక్ష్మిని బలవంతపెట్టాడు. తన తల్లిదండ్రులు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పడంతో అఖిల్ కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 'నన్నే పెళ్లి చేసుకోనంటావా.. నీ అంతు చూస్తా' అని.. ఆమెను హత్య చేయడానికి పథకం రచించాడు.

చంపేసి.. గుట్టపై పడేశాడు..

Boyfriend Killed Girlfriend in Karimnagar : ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత అకస్మాత్తుగా ఒకరోజు వరలక్ష్మి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆమె ప్రియుడు అఖిల్​ను అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని విచారించగా.. తనని పెళ్లి చేసుకోనని అన్నందుకే ఆమెను చంపానని ఒప్పుకున్నాడు. ఆమెను చంపి.. చెంజర్లలోని ఓ గుట్టపై పడేశానని చెప్పాడు.

కఠినంగా శిక్షించండి..

Man Murdered Girlfriend in Manakondur : అతను చెప్పిన వివరాల సాయంతో పోలీసులు హత్య జరిగిన స్థలానికి వెళ్లారు. అక్కడ వరలక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కూతుర్ని అనవసరంగా పొట్టన పెట్టుకున్నాడని అఖిల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.