ETV Bharat / crime

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం.. - man udumalpuram railway trackdied on

సాప్ట్ వేర్​ ఇంజనీర్​గా పనిచేస్తున్న ఓ యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఉడుమల్పురంలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజుల క్రితమే పవన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడంతో మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

suicide
రైలు కింద పడి యువకుడు మృతి
author img

By

Published : Jun 15, 2021, 10:26 PM IST

రైలు కింద పడి పవన్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన పవన్ కుమార్ బెంగుళూరులో సాప్ట్ వేర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో నంద్యాల సమీపంలోని ఉడుమల్పురం రైలు పట్టాలపై ఆ యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కొన్ని రోజుల క్రితమే పవన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకొంది. అంతలోనే పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెల్లెల్లు బలవన్మరణానికి పాల్పడడంతోనే పవన్ కుమార్ ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. మృతుడి తండ్రి జంబులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రెండు రోజుల్లో నిశ్చితార్థం.. షాకిచ్చిన యువతి

కరోనా టీకాతో దేశంలో తొలి మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.