ETV Bharat / crime

SUICIDE: రేపు పెళ్లి.. ఇంతలో ప్రియుడి ఆత్మహత్య..ఎందుకు? - పెళ్లి ముందు రోజే యువకుడి ఆత్మహత్య

Man Commits Suicide Day Before Wedding : భార్యతో 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. అనంతరం మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఏడాది పాటు సహజీవనం చేసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలో అతడు మాయమయ్యాడు. వారం తర్వాత మళ్లీ ఇంటికి వచ్చాడు. రేపు వివాహం జరగాల్సి ఉండగా.. నిన్న మధ్యాహ్నం మహిళ ఇంట్లోలేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన మహిళ బలవన్మరణానికి యత్నించగా పోలీసులు రక్షించారు. అసలేం జరిగింది..

SUICIDE
రేపు పెళ్లి.. ఇంతలో ప్రియుడి ఆత్మహత్య..ఎందుకు?
author img

By

Published : May 24, 2022, 3:22 PM IST

Man Commits Suicide Day Before Wedding :సహజీవనం చేస్తున్న మహిళను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న వివాహానికి ఏర్పాట్లు చేసుకోగా సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత వివరాల మేరకు... కడప జిల్లా కొండాపురానికి చెందిన విజయ్‌కుమార్‌(40)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అదే జిల్లాలో రైల్వే స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నాడు.

హైదరాబాద్‌ నగరంలోని టప్పచపుత్రాలో నివసించే మహిళతో ఎనిమిదేళ్ల కిందట పరిచయమైంది. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితం విజయ్‌కుమార్‌ ఆ మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్‌ ఠాణాకు బదిలీచేశారు. రాజేంద్రనగర్‌ పోలీసులు ఆదివారం విజయ్‌కుమార్‌, ఆ మహిళను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు.

సోమవారం వివాహ దుస్తులు తెచ్చుకోవడానికి ఆమె వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్‌కుమార్‌ కాబోయే భార్యకు ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె ఇంటికి చేరుకుంది. అప్పటికే అతను మృతిచెందాడు. దీంతో ఆమె ఖైరతాబాద్‌ సమీపంలో ఎంఎంటీఎస్‌ రైలు కిందపడి చనిపోవాలని పట్టాలపై పడుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా గుర్తించి కాపాడారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.