తండ్రి మందలించాడన్న నెపంతో ఓ విద్యార్థి.. రైలు కింద పడి ఆత్మహత్య(student commits suicide by falling train at Tadipatri) చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ్టి ఉదయం చోటు చేసుకుంది. తాడిపత్రికిలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన హమాలీ కుమారుడు నవీన్(21).. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం(naveen commits suicide at Tadipatri) చదువుతున్నాడు. అయితే, నవీన్ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు అని బంధువులు తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో నవీన్‌కు తండ్రి ఫోన్ చేసి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్.. రాత్రి ఇంటికి వెళ్లకుండా బయటే ఉన్నాడని నవీన్ సన్నిహితులు తెలిపారు. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సమీపంలో రైలు పట్టాలపై నవీన్ మృతదేహాన్ని(naveen commits suicide at Tadipatri) రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..: కర్నూలు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు