Illegal Contact Murders: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని కోయిలతోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి గాయత్రి అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె ఇటీవల అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్త శ్రీనివాస్‌కు తెలిసింది. శ్రీనివాస్ ఈ విషయాన్ని బయటపెట్టకుండా సమయం కోసం వేచి చూశాడు. గురువారం రాత్రి భార్య గాయత్రి తన ప్రియుడుకి వీడియో కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.
చనువుగా ఉన్న వీడియోలను చూసి..
భర్త శ్రీనివాస్ తన భార్య సెల్ఫోన్లో వారిద్దరూ చనువుగా ఉన్న వీడియోలను చూశాడు. నాకు వేరే పని ఉంది... ఆలస్యంగా ఇంటికి వస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్లి.. ముందు తన భార్యతో ఉన్న వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత తన భార్య ప్రియుడుకి చేసిన వీడియో క్లిప్పింగ్స్ చూపించి ఆమెను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: