Hundees Theft Gang: ఆలయాల్లో హుండీల చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, హుండీలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కాగా.. పరారైన వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
Theft gang arrest in guntur: ఈ ముఠా గుంటూరు జిల్లాలో దేవాలయాల హుండీలను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యులకు.. గుంటూరు గోరింట్లలోని కేసుతోపాటు మొత్తం 23 కేసుల్లో ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. తోకలవానిపాలెేనికి చెందిన వీరంతా.. చెడు వ్యసనాలకు బానిసై గ్యాంగ్గా ఏర్పడి దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు.
వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 చోట్ల దొంగతనాలు చేశారు. ఒక ఆటోలో వచ్చి కట్టర్తో ఆలయాల్లోని హండీలను చోరీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరికొన్నింటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆరు నెలలుగా వీరు చోరీలు చేస్తున్నారు. - ఆరిఫ్ హఫీజ్ , గుంటూరు అర్బన్ ఎస్పీ
ఇవీ చూడండి: