ETV Bharat / crime

PETROL ATTACK ON GIRL: యువతికి నిప్పంటించిన ఉన్మాది.. హర్షవర్దన్‌ మృతి

author img

By

Published : Nov 16, 2021, 8:31 AM IST

Updated : Nov 16, 2021, 1:41 PM IST

harsha-vardhan-reddy-died-who-attacked-with-petrol-on-a-girl-at-vishaka
యువతికి నిప్పంటించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి..

08:19 November 16

ఈనెల 13న యువతిపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పంటించుకున్న హర్షవర్దన్‌

విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటనలో(PETROL ATTACK ON GIRL) గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్దన్‌ మృతి చెందాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపై పెట్రోల్‌(VISHAKA PETROL ATTACK)పోసిన హర్షవర్దన్‌ తానూ నిప్పంటించుకున్నాడు. పెళ్లికి నిరాకరించడంతో హర్షవర్దన్ యువతిపై దాడికి పాల్పడటంతో మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. 

అసలేం జరిగిందంటే..

సూర్యాబాగ్‌ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్‌ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన (VISHAKA PETROL ATTACK CASE ACCUSED),పలకల హర్షవర్ధన్‌రెడ్డి(21), విశాఖ నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు...తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి నడుము భాగం నుంచి ముఖం వరకు తీవ్రంగా కాలిపోయింది. హర్షవర్థన్‌రెడ్డి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డాడు.

సాయంత్రం సుమారు 4.15 గంటల సమయానికి ప్రమాదం జరిగితే.. పోలీసులకు 6.30గంటలకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో యువకుడే ప్రధాన నిందితుడని తేల్చారు. యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు.

నిందితుడిపై హత్యాయత్నంపాటు ఆత్మహత్యాయత్నం కేసులను నమోదు చేశారు. అలాగే పెట్రోలు పోసి నిప్పంటించడానికి ముందు తనతో తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆ యువతి ఆదివారం ఉదయం పోలీసులకు చెప్పడంతో.. హర్షవర్థన్‌ రెడ్డిపై లైంగిక వేధింపుల సెక్షన్లను కూడా జోడించారు.

హర్షవర్ధన్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి రాంరెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గతేడాదే బీటెక్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డికాలనీలో విషాదం నెలకొంది.

సంబంధిత కథనాలు:

ATTACK : యువతిపై ప్రేమోన్మాది దాడి...అసలేం జరిగింది...?

VISHAKA PETROL ATTACK: యువతికి నిప్పంటించిన నిందితుడిపై.. హత్యాయత్నం కేసు

Last Updated : Nov 16, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.