Love Harassment: బాలికను ప్రేమించాలని వెంటపడిన యువకుడిని చితకబాదిన ఘటన తెలంగాణ హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ప్రసాద్.. కాజీపేటకు చెందిన బాలికను ప్రేమించమని కొన్ని రోజులుగా వెంటపడుతున్నాడు. బాలిక కుటుంబసభ్యులు మందలించినా అతను మారలేదు.
శుక్రవారం బాలిక ఇంటివద్దకు వచ్చిన యువకుడు.. బాలికను బయటికి రావాలని బెదిరించాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ప్రసాద్‌ను తీవ్రంగా చితకబాదారు. బాలిక ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
విషయం తెలుసుకున్న యువకుని తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని... తన కుమారుడిని కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన అతనిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది చదవండి:వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం