ETV Bharat / crime

Wedding Twist: పెళ్లికి సరిగ్గా గంట ముందు.. వరుడు ఏం చేశాడంటే? - సంగారెడ్డి జిల్లా వార్తలు

Groom Ran Away: వివాహానికి గంట ముందు కట్నం డబ్బులతో వరుడు పరారయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Wedding
Wedding
author img

By

Published : Dec 16, 2021, 6:33 PM IST

Groom Ran Away: వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. అదికూడా.. కట్నం డబ్బులతో ఉడాయించాడు! దీంతో అర్థంతరంగా పెళ్లి ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతిని.. కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆగస్టు 27న వీరికి నిశ్చితార్థం జరిపించగా.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడికి కట్నం కింద ఇచ్చారు. ఈనెల 12న వివాహం చేయాలని నిర్ణయించారు.

సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో కల్యాణ మండపంలో వేదిక ఏర్పాటు చేశారు. వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు పారిపోయాడు. అనంతరం మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుభాష్​ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ బుధవారం రోజు వధువు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకోగా బుధవారం రోజు వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: EXTRAMARITAL AFFAIR: వివాహేతర సంబంధంతో ఇద్దరు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.