లారీలో తరలిస్తున్న 1300 కిలోల గంజాయిని మంగళగిరి గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడులోని తేనే జిల్లాకు చెందిన ముగ్గురు లారీ డ్రైవర్లు.. విశాఖకు గ్రైండర్ లోడు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద ఓ వ్యక్తి నుంచి గంజాయి లోడ్ చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు తరలిస్తుండగా.. కాజా టోల్ గేట్ వద్ద పోలీసులకు చిక్కారు. పట్టుబడ్డ గంజాయి 1300 కిలోలు ఉంటుందన్నారు. లారీని సీజ్ చేశారు. ఈ కేసులో అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టు మందు ప్రవేశపెట్టినట్లు మంగళగిరి గ్రామీణ సీఐ భూషణం తెలిపారు.
చల్లపల్లిలో గంజాయి ముఠా అరెస్టు
గంజాయి విక్రయిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నట్లు గుర్తించి... ఐదుగురిని కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 5 కేజీల గంజాయి, రూ.1,380 నగదు, 2 ఫోన్లు, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో విజయవాడ రోడ్డులో.. గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.
" ఐదుగురితో కూడిన ఈ ముఠా.. విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. చల్లపల్లి సమీపంలో చాలా మంది ఈ వ్యసనానికి బాసనిలైనట్లు విచారణలో తెలింది. వాళ్లందరికి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. అయితే పిల్లల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి" అని డీఎస్పీ మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు.
రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం
ఈ తరహా అక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని.. అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి గంజాయి ముఠాను అరెస్టు చేసిన చల్లపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై సందీప్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: