GANJA BATCH HULCHAL : విజయవాడలోని స్థానిక ఐలాపురం హోటల్ సెంటర్‌లో గంజాయి బ్యాచ్ సభ్యులు వీరంగం సృష్టించడంతో స్థానికులు, వ్యాపారులు భయభ్రాంతులకు గురయ్యారు. చిత్తుకాగితాలు ఏరుకునే ఎన్.రాఘవ, వెంకటరత్నంల మధ్య మాటా మాటా పెరిగి రోడ్డుమీద గంజాయి మత్తులో కర్రలతో కొట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వాహనచోదకులు భయాందోళనతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాంబమూర్తి రోడ్డులో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ సభ్యుల అరాచకాలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: