cars burnt in Jubilee Hills fire incident: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకేసారి నాలుగు కార్లు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. జింఖానా క్లబ్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రేంజ్‌రోవర్‌తో పాటు మరో మూడు కార్లు దగ్ధమయ్యాయి.
పార్క్ చేసిన చోటే...
జింఖానా క్లబ్‌కు వచ్చిన పలువురు సభ్యులు తమ వాహనాలను శాంగ్రీల్ల ప్లాజా సమీపంలో పార్క్ చేశారు. హఠాత్తుగా మంటలు చెలరేగి రేంజ్ రోవర్, బ్రీజా, తార్, ఇన్నోవా వాహనాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఫిలింనగర్లో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో మంటలు చేలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలార్పారు.
ఇదీ చూడండి:
Lockup death: నెల్లిమర్ల పీఎస్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. అసలేమైంది?