ETV Bharat / crime

MURDER: విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్య.. అందుకేనా..? - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

MURDER: చిన్నపాటి వివాదం ఫుట్​బాల్​ ప్లేయర్​ ప్రాణాలు తీసింది. మద్యం మత్తులో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని.. ప్రత్యర్థులు దారుణంగా పొడిచి చంపారు. శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమ కుమారుడిని హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.

MURDER
విజయవాడలో కలకలం రేపుతోన్న ఫుట్‌బాల్‌ ఆటగాడి హత్య
author img

By

Published : Jun 1, 2022, 5:46 PM IST

MURDER: విజయవాడలో ఫుట్‌బాల్‌ ఆటగాడు ఆకాశ్​ హత్య కలకలం రేపుతోంది. బార్‌లో జరిగిన వివాదంతో ప్రత్యర్థులు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన గురునానక్‌ కాలనీలో జరిగింది. వాంబేకాలనీలో అనుమానాస్పద స్థితిలో శంకర్‌ అలియాస్‌ టోనీ అనే వ్యక్తి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో టోనీ అనుచరులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో దగ్గరలోని ఓ బార్‌లో మద్యం తాగడానికి వెళ్లారు. వీరిలోనే రెండు గ్రూపులున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన జక్కంపూడి కాలనీకి చెందిన ఆకాశ్‌(23) అనే యువకుడికి, మరో వర్గానికి చెందిన వారితో గొడవ జరిగింది. దీంతో అతను ప్రత్యర్థుల్లో ఒకరిని కొట్టాడు. అనంతరం ఆకాశ్‌ను అక్కడున్న వారు బలవంతంగా గురునానక్‌కాలనీలోని అతని స్నేహితుడి గదికి తీసుకొచ్చారు.

విజయవాడలో కలకలం రేపుతోన్న ఫుట్‌బాల్‌ ఆటగాడి హత్య

ఆ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు 10 మందికి పైగా మద్యం, గంజాయి తాగి గురునానక్‌ కాలనీకి వచ్చారు. ఆ సమయంలో ఆకాశ్‌ మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఉండగా, ప్రత్యర్థులను చూసి ఇద్దరు పారిపోయారు. అక్కడ ఉన్న మరో వ్యక్తిని వారు బెదిరించి బయటకు పంపించేశారు. అనంతరం ఆకాశ్‌ను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. అరగంట తర్వాత పారిపోయిన స్నేహితులు వచ్చి రక్తపుమడుగులో ఉన్న ఆకాశ్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఖాదర్‌ బాషా, పటమట ఇన్‌ఛార్జి సీఐ కృష్ణమోహన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని, వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఆకాశ్‌ శరీరంపై మొత్తం 16 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న అతని మిత్రులు 50 మందికి పైగా ఆస్పత్రికి చేరుకున్నారు.

ఫుట్​బాల్ కోచింగ్ ఇస్తూ ఆకాశ్​ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.