ETV Bharat / crime

Fire Accident: ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం - కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు దగ్ధం

ongole fire accident
ongole fire accident
author img

By

Published : Mar 1, 2022, 10:27 AM IST

Updated : Mar 1, 2022, 12:33 PM IST

10:24 March 01

కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు దగ్ధం

ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్ సమీపంలో మంటలు... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం

Fire Accident: ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉడ్‌ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్‌ చేసిన ప్రైవేటు బస్సులకు మంటలు అంటుకుని భారీ ఎత్తున చెలరేగాయి. ఈ ఘటనలో 8 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటి పక్కనే మరో 20 బస్సుల వరకు ఉన్నాయి. ఈ బస్సులన్నీ తమవేనని కావేరి ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో బస్సులన్నీ ఉడ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ. 8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

ఏసీ బస్సులు కావడంతో కంప్రెసర్​లు, టైర్లు పేలి చట్టుప్రక్కల వారిని భయబ్రాంతులకు గురి చేసింది. ఒంగోలు, టంగుటూరు, అద్దంకి ప్రాంతాల నుంచి ఆరు అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Mother suicide with children : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Last Updated : Mar 1, 2022, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.