fire accident in ghmc office: తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులోని పన్ను విభాగంలో మంటలు చెలరేగడంతో దస్త్రాలు పూర్తిగా బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు 3 అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను ఆర్పారు.
ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. భయంతో మూడో అంతస్తులోని సిబ్బంది కిందకు దిగిరాగా.. ఐదో అంతస్తులోని సిబ్బంది టెర్రస్ పైకి పరిగెత్తారు. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. క్రేన్ సాయంతో టెర్రస్‌పై ఉన్న ఉద్యోగులను కిందికి దించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Live Video: కరీంనగర్‌లో భారీ వర్షం.. కూలిన 70 అడుగుల ఎత్తైన లుమినార్