ETV Bharat / crime

'నాది ఫేస్‌బుక్‌ లవ్... ప్రియుడితో వివాహం చేసే వరకు తగ్గేదేలే' - AP News

Face book love: ఓ యువతి ప్రేమాయణం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎవరో ఏంటో తెలియకుండానే.. ఓ అబ్బాయితో ఫేస్‌బుక్‌ వేదికగా ప్రేమలో పడింది. కనీసం ముఖాలు చూసుకోకుండానే ఏడాదిపాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. యువకుడు ప్రేమకు ఫుల్ స్టాప్ పెడదామనుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..!

Face book love
Face book love
author img

By

Published : Feb 19, 2022, 1:55 PM IST

పోలీసులకు తలనొప్పిగా మారిన యువతి ఫేస్‌బుక్‌ లవ్...

Face book love: ఓ యువతి ప్రేమాయణం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎవరో ఏంటో తెలియకుండానే.. ఓ అబ్బాయితో ఫేస్‌బుక్‌ వేదికగా ప్రేమలో పడి... కనీసం ముఖాలు చూసుకోకుండానే ఏడాదిపాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. యువకుడు ప్రేమకు ఫుల్ స్టాప్ పెడదామనుకున్నాడు. కానీ యువతి మాత్రం ప్రియుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కుదరదని యువకుడు తెగేసి చెప్పడంతో...న్యాయం చేయాలంటూ అనంతపురం సఖి కేంద్రంలో తిష్ట వేసింది.

ప్రియుడితో వివాహం చేసే వరకు కదిలేదే లేదు..

గుంతకల్లుకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కుమార్తె.. ఒంగోలుకు చెందిన అబ్బాయి.. ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. స్నేహం కాస్తా ప్రేమగా మారి... ఏడడుగల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. యువకుడిని ఫోన్‌లో తిట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో అబ్బాయి యువతితో మాట్లాడటం మానేశాడు. ప్రియుడు విజయనగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి.. ఎందుకు ముఖం చాటేస్తున్నావని నిలదీసింది. పెళ్లికి పెద్దలు అంగీకారం లేనందున... కలవడం కుదరదని యువకుడు తెగేసి చెప్పేశాడు. దీంతో చేసేదేమీ లేక అనంతపురానికి తిరిగి వచ్చింది. న్యాయం చేయాలంటూ ఐసీడీఎస్ సఖి కేంద్రంలో తిష్టవేసింది. ఆశ్రయం కోరి వస్తే తనను మహిళా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని యువతి ఆరోపించింది. ప్రియుడితో వివాహం చేసే వరకు కదిలేదేలే అంటోంది.

ఎవరు చెప్పినా వినకపోయేసరికి ...

యువతి ప్రేమాయణం తెలుసుకున్న సఖి కేంద్రంలోని సిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత నచ్చజెప్పినా యువతి వినకపోవడంతో దిశా పోలీసులకు సమాచారమిచ్చారు. సఖి కేంద్రంలో భవనాలపై ఎక్కి దూకేస్తానంటూ బెదిరించి హల్ చల్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరు చెప్పినా వినకపోయేసరికి... ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు సతమతమవుతున్నారు. తమ కుమార్తె ఎవరిని ప్రేమించిందో తమకు తెలియదని యువతి తల్లిదండ్రులు అంటున్నారు.

ఇదీ చదవండి:

Husband Harassment: అందంగా లేవని భర్త వేధింపులు... భార్య బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.