ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన ఓ తల్లీ, ఇద్దరు చిన్నారులను ప్రకాశం జిల్లా ఈపురూపాలెం పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో ఒంగోలు నగరంలోని శ్రీనివాసకాలనికి చెందిన అనురూప ఇద్దరు చిన్నారులతో చీరాల మండలం వాడరేవుకు చేరింది. ఇంట్లో నుంచి అనురూప వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాడరేవులో ఉన్నట్లు గుర్తించారు.. వెంటనే ఈపురుపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లి ఆమెను, పిల్లలను గుర్తించి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం వారిని ఒంగోలు పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తల్లి, పిల్లలను కాపాడిన ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావును, స్టేషన్ సిబ్బందిని పోలీసు అధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: