గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోడలు ప్రియాంకే అత్త మైథిలిని హత్య చేసినట్లు నిర్ధారించారు. అత్తాకోడళ్ల మధ్య గొడవ కారణంగా... అత్తను కత్తితో పొడిచి, చపాతి కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలు ప్రియాంకను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెనాలి బస్టాండుసమీపంలోని ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 306లో పాన్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్న బద్రి నారాయణ మూర్తి, మైధిలి(53) దంపతులు నివసిస్తున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం నవీన్ అనే వ్యక్తిని దత్తత తీసుకున్నారు. అతనికి వివాహం జరిగింది. ఈనెల 28న తాడికొండ మైథిలి(53) అపార్టుమెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. అత్తతో జరిగిన గొడవ కారణంగానే కోడలు కత్తితో పొడిచి, చపాతీ కర్రతో కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు.
తలకు గాయాలు.. రక్తపు మడుగులో మృతదేహం
శనివారం రాత్రి దాదాపు ఏడున్నర గంటల సమయంలో... ఫ్లాట్ నెంబర్ 306 నుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి మైథిలి రక్తపుమడుగులో పడి ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రక్తపు మడుగులో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే..