ETV Bharat / crime

CRIME NEWS: కాకినాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు

AP CRIME NEWS: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేర్వేరు ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖలో విద్యుదాఘాతంతో ఒకరు మరణించగా.. కాకినాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో నలుగురు గాయపడ్డారు.

crime news in andhra pradesh
ఏపీ నేర వార్తలు
author img

By

Published : Apr 30, 2022, 11:50 AM IST

Updated : Apr 30, 2022, 11:24 PM IST

CRIME NEWS: విశాఖ జిల్లా.. విశాఖ జిల్లా పాత వడ్లపూడిలో విషాదం నెలకొంది. జూనియర్‌ లైన్‌మెన్‌ వెంకటగిరి.. విద్యుదాఘాతంతో స్తంభం పైనుంచి పడి మరణించారు. మృతుడు వెంకటగిరి స్వస్థలం పాడేరు జిల్లా గూడెంకొత్తవీధి మచ్చర్లగా గుర్తించారు.

కాకినాడ జిల్లా.. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగింది. అర్ధరాత్రి సమయంలో.. కర్రలు, కత్తులతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనటంతో.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో పోలీసుల మోహరించారు.

* కురసాంపేట గ్రామంలో ఉదయం భార్యపై భర్త అమానుషంగా దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏలూరు.. జిల్లాలోని శృంగవరప్పాడు, కొల్లేరులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొల్లేరు నాటుసారా తయారీ స్థావరాలను.. ఎస్పీ డ్రోన్‌ కెమెరాలతో గుర్తించారు. శృంగవరప్పాడులో 4 వేల లీటర్ల బెల్లం ఊట, 5 వేల లీటర్ల సారా ధ్వంసం చేసి.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

  • గతేడాది ద్వారకా తిరుమలకు చెందిన ఓ బ్యాంకు బ్రాంచిలో కొత్తగా ఛార్జి తీసుకున్న మేనేజర్‌ శాఖలో కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇతరుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద గతంలో బ్రాంచిలో పనిచేసిన ఓ ఉద్యోగి ఏడాది కాలంలో రూ.90 లక్షల మేర మోసం చేసి రుణాలు తీసుకోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది.

ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణాలుగా తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో సంబంధిత బ్యాంకులు రుణగ్రహీతలకు 2019లో తాఖీదులు ఇచ్చాయి. ఈ వ్యవహారంలో మోసపోయామంటూ కొండంగి ప్రాంతానికి చెందిన రైతులు కొందరు భీమవరంలోని పోలీసులను అప్పట్లో ఆశ్రయించారు. పొలాల కాగితాలు ఇవ్వమని భీమవరంలోని కొందరు బడాబాబులు కోరితే వారి మాటలు నమ్మి ఇస్తే వాటిని బ్యాంకుల్లో పెట్టి మోసగించారని రైతులు వాపోయారు.

జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు వెలుగు చూడటంతో కలకలం రేగింది. పెదపాడు మండలం కలపర్రులో ఓ ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ సెంటర్‌ నిర్వాహకుడు. తనను నమ్మిన ఊర్లోని దాదాపు 60 మందిని మోసం చేసి రూ.లక్షలతో ఉడాయించాడు. జంగారెడ్డిగూడెం లక్కవరం గ్రామంలో యూనియన్‌ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు) పొరుగు సేవల ఉద్యోగి ఒకరు ఆ గ్రామ రైతుల నమ్మకాన్ని కూడగట్టుకుని రూ.లక్షల మేర వారి సొమ్ముతో గోల్‌మాల్‌కు పాల్పడ్డారు.

‘చాలా మంది బ్యాంకు బ్రాంచ్‌ వరకు వెళ్తారు. క్యాషియర్‌ అక్కడే ఉంటారు. కానీ సమయం కలిసొస్తుందని అక్కడ తెలిసున్న ఏ ఉద్యోగికో డబ్బులిచ్చి వెనక్కొచ్చేస్తారు. ఇలాంటి తప్పిదాలే మోసాలకు దారితీస్తాయి. జంగారెడ్డిగూడెంలో జరిగిందీ ఇదే. కొన్ని మోసాలు బ్యాంకు బయటే జరిగిపోతాయి. బ్యాంకు వాళ్లకు కనీసం సమాచారం కూడా ఉండదు. ఇటీవల అన్ని ఖాతాలకు ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేస్తున్నాం’ అని ఉమ్మడి జిల్లాల లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సరోజనమ్మ అనే మహిళ గురువారం రాత్రి అనుమానస్పదంగా మృతి చెందారు. మృతదేహాన్ని పాలకొండ మండలం వెలుగోడులో శుక్రవారం కుటుంబ సభ్యులు ఖననం చేశారు. మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మృతురాలి మేనమామ అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు తహసీల్దార్ సోమేశ్వరరావు అనుమతితో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందన్న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

  • పాచిపెంట మండలం కోనవలస చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం.. పాచిపెంట డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు అధికారులు తనీఖీలు చేపట్టారు. వారికి వచ్చిన సమాచారం మేరకు.. చెక్​పోస్టు వద్ద గల దుర్గమ్మ గుడి వద్ద.. ఒడిశా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

బాపట్ల జిల్లా.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్​ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటన.. బాపట్ల జిల్లా రేపల్లె ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో జరిగింది. విజయవాడ నుంచి రేపల్లె వచ్చిన కరకట్ట ఎక్స్​ప్రెస్ సర్వీస్.. బస్ స్టాండ్ సమీపంలో ప్రయాణికులను దింపింది. డ్రైవర్ బస్సును గ్యారేజి లోపలికి తీసుకు వెళ్తుండగా.. వేగంగా మలుపు తిప్పడంతో అదుపు తప్పి ట్రాన్స్ ఫార్మర్ స్తంభాలను ఢీ కొట్టింది. కరెంట్ స్తంభాలు విరిగటంతో తీగలు తెగి బస్సు మీద పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

వైఎస్​ఆర్ జిల్లా.. ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి.. దుండగులు రూ.5 లక్షలు అపహరించిన ఘటన.. వైఎస్​ఆర్ జిల్లా పొద్దుటూరులో జరిగింది. కారు కొనుగోలు నిమిత్తం పొద్దుటూరు నుంచి ఆదూరూపల్లి వచ్చిన ఖాదర్​ బాష.. భోజనం చేసొచ్చి డబ్బులు చెల్లిస్తామని కారు ఒక చెట్టు క్రింద ఆపారు. భోజనం అనంతరం తిరిగి అక్కడకు వచ్చేసరికి కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులను అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారం గా దర్యాప్తు చేస్తున్నారు.

  • జిల్లాలోని వేంపల్లె మండలంలోని నందిపల్లె గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భౌతికశాస్త్ర విభాగ అధికారిణి ఎద్దుల భవాని మరణించారు. పులివెందులలో నివసిస్తున్న భవాని.. ట్రిపుల్ ఐటీకి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. నందిపల్లె వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు టైరు పగిలి డివైడర్​ను ఢీకొట్టి పులివెందుల వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ప్రమాదంలో భవానికి తీవ్రంగా గాయపడగా.. మరో వాహనంలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే భవానిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించారు. ఈమె భర్త మనోహర్​ రెడ్డి లింగాల మండలంలోని పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు.. ఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు.

విజయనగరం జిల్లా.. బెట్టింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థి అప్పులపాలైన ఘటన.. విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చలేక మద్యానికి బానిసై దొంగగా మారి చివరికి పోలీసులకు చిక్కాడు. అతని నుంచి రూ.75 వేల నగదు.. ద్విచక్రవాహనం, రెండు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపారు.

నగరానికి చెందిన ఓ దుకాణ యజమాని ఈనెల 27న రాత్రి తన భార్యతో ఇంటికెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి వారి బ్యాగ్‌ లాక్కొని పరారయ్యాడు. వారి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ మురళీ, ఎస్సైలు అశోక్‌కుమార్, దుర్గాప్రసాద్, సిబ్బంది సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడు వెళ్లిన రూటును గుర్తించారు. బాధితుల బ్యాగ్‌లో ఐఫోన్‌ ఉండడంతో దాని ఆధారంగా ట్రాక్‌ చేయగా విశాఖ జిల్లా బర్మాకాలనీ వద్ద ఆ వాహనం కనిపించింది. ఈ బైక్‌ అక్కడ నివాసముంటున్న జి.రాజేష్‌ దని తేలడంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సాయంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11న కూడా చోరీ చేశాడని, డిగ్రీ చదువుతున్నాడని, బెట్టింగ్‌లు చేస్తూ అప్పులపాలై దొంగతనాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఏఎస్పీ తెలిపారు.

నెల్లూరు జిల్లా: చేజర్ల మండలం ఆదూరుపల్లి ఆగివున్న కారులో దుండుగులు ముందు అద్దాలు ధ్వంసం చేసి రూ.5 లక్షల నగదు అపహరించారు. కారు కొనుగోలు నిమిత్తం పొద్దుటూరు నుంచి ఆదూరూపల్లి వచ్చిన ఖాదర్​బాష.. భోజనం చేసేందుకోసం తన కారును ఒక చెట్టు కింద నిలిపారు. భోజనం పూర్తిచేసుకొని తిరిగి వచ్చి చూసే సరికి గుర్తు తెలియని వ్యక్తులు కారుతోపాటు.. నంబరు ప్లేట్​ కూడా ధ్వంసం చేశారని, కారుకు రక్తపు మరకలు కూడా ఉన్నాయని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం బంగారుపాలెంలో విషాదం నెలకొంది. బావిలో అనుమానాస్పద స్థితిలో అక్క, తమ్ముడు మృతి చెందారు. అక్క జాహ్నవి, తమ్ముడు దినేశ్‌ ఉదయం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఎంతకు తిరిగి రాకపోవటంతో అంతటా వెతికారు. ఈ క్రమంలో ఊరు శివారులోని బావిలో అక్క, తమ్ముడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ముత్యాలమ్మ ఆలయం బావి వద్ద కనిపించిన పిల్లల సైకిల్, పుస్తకాలను గుర్తించారు. పిల్లలు ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అక్కాతమ్ముడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

తల్లితో సహజీవనం.. ఆమె కుమార్తెపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!

Last Updated : Apr 30, 2022, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.