హైదరాబాద్లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ వీడియో తీసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర్ప్రదేశ్ ఖుషీనగర్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. బాసరగుడిలోని టపాసుల కర్మాగారంలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం పంపించారు. కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు.
బాలుడుని కదలకుండా గట్టిగా పట్టుకున్న యువకులు.. వదిలిపెట్టాలని ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు. తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్ఫోన్ కూడా లాక్కున్నారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు.
ఇవీ చూడండి..