ETV Bharat / crime

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి - TS LATEST NEWS

clashes-on-the-telangana-chhattisgarh-border
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
author img

By

Published : Oct 25, 2021, 10:00 AM IST

Updated : Oct 25, 2021, 2:46 PM IST

09:59 October 25

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Clashes on the Telangana-Chhattisgarh border
మృతిచెందిన మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు సమీపంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్​లో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). 

ఏజెన్సీలో అలజడి

ఘటనా స్థలం నుంచి 3 మృతదేహలతో పాటు ఎస్​ఎల్​ఆర్, ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తప్పించుకున్న వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.  

మృతిచెందిన మావోయిస్టుల వివరాలు

ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టులు ఐత అలియాస్ ఐతడు, ముర్చకి ఉంగల్ అలియాస్ రఘుగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఐత ఈ ఘటనలో మృతిచెందినట్లు తెలిపారు. రఘు బీజాపూర్ జిల్లా బైరంగడు మండలం కుర్రవాడ గుంపు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
 
ఇదీ చదవండి: Actor died: టాలీవుడ్ నటుడు రాజబాబు మృతి

Last Updated : Oct 25, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.