YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ రేపు విచారణకు రానున్న దృష్ట్యా.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పిటిషన్‌లో సునీతారెడ్డి చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ పేర్కొంది. కేసు విచారణాధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని తెలిపింది. 164 స్టేట్‌మెంట్ ఇస్తానన్న పోలీసు అధికారి శంకరయ్యకు పదోన్నతి కల్పించారని పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారన్న సీబీఐ.. ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణ జాప్యం అవుతోందని తెలిపింది. నిందితులు చెప్పిన విధంగానే స్థానిక పోలీసులు వ్యవహరించారని సీబీఐ పేర్కొంది.
ఇవీ చదవండి: