స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి రుణం తీసుకుని.. ఆ బ్యాంకును రూ.48.05 కోట్ల మేర మోసగించారన్న అభియోగంపై విజయవాడ ఎనికేపాడులోని బాలాజీ రా అండ్ పార్ బాయిల్డ్ రైస్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్, పల్లవి ఎంటర్‌ప్రైజస్, గిరిజ మోడ్రన్ రైస్ మిల్లులతోపాటు వాటి యాజమాన్య ప్రతినిధులు, తీసుకున్న రుణానికి హామీదారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై ఈ కేసు పెట్టింది.
ఆయా రైస్ మిల్లులతోపాటు, నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, సంబంధిత రైస్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు, రుణానికి పూచీకత్తుదారులైన తాటికొండ విశ్వనాథం, తాటికొండ సావిత్రి, వూటుకూరి వెంకట అజయ్ కృష్ణ, వూటుకూరి వైశాలి, అత్తులూరి వెంకట లక్ష్మీ గిరిజ, పోతూరి వెంకట రామ వనజ, కారుమూరి వెంకట పల్లవితో పాటు కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి: TOLLYWOOD DRUGS CASE: కెల్విన్‌కు డబ్బు పంపారా? ఛాటింగ్ చేశారా?