ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పెట్రోల్ ట్యాంకర్‌ను ఎంచుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ గంజాయిని పట్టుకున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం వద్ద ఈ ఘటన జరిగింది. విశాఖ జిల్లా అరకు ప్రాంతం నుంచి వస్తున్న లారీ.. పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. చెక్‌పోస్ట్ తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను చూసిన ఆ లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు.. ట్యాంకర్ తనిఖీ చేయగా 149 ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది. ఒక్కో ప్యాకెట్‌లో సుమారు 4 నుంచి 5 కిలోల మేర ఉండొచ్చని.. మొత్తంగా 7వందల కిలోల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 215 కేజీల గంజాయి పట్టివేత- డ్రైవర్ అరెస్టు