ETV Bharat / crime

అమ్మాయిగా స్నేహం.. ప్రేమ పేరుతో దాడి.. చివరకు

కృష్ణాజిల్లా మైలవరంలో గత నెల 26వ తేదీన జరిగిన దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి తెలిసిన వ్యక్తే.. ఫేస్​బుక్​లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పెట్టి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

boy-cheated-his-friend-at-vijayawada
అమ్మాయిగా స్నేహం.. ప్రేమ పేరుతో దాడి.. చివరకు జైలుకు
author img

By

Published : Nov 2, 2021, 2:26 PM IST

అమ్మాయిగా స్నేహం.. ప్రేమ పేరుతో దాడి.. చివరకు జైలుకు

కృష్ణాజిల్లా మైలవరంలో గత నెల 26వ తేదీన జరిగిన దారి దోపిడీ(FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం) కేసును పోలీసులు ఛేదించారు. దయాకర్ అనే వ్యక్తి... యార్లగడ్డ డేవిడ్​కు ఫేస్‌బుక్​లో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ పెట్టి మోసగించాడని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు దయాకర్ బాధితుడి​కి పరిచయస్తుడేనని పేర్కొన్నారు.

అక్టోబర్ 25వ తేదీ రాత్రి పుల్లూరు రమ్మని చాట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత దాడి చేసి 3 ఉంగరాలు, చైన్ దోచుకుని గొంతు కోశారని చెప్పారు. గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మంకీ క్యాప్​లు ధరించారన్నారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులు దయాకర్, ఫణిలను విజయవాడలో అరెస్ట్ చేశామన్నారు. ఫేస్‌బుక్ చాటింగులు నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.

ఇదీ చూడండి:

FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.