ETV Bharat / crime

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం...రూ.100 కోసం దాడి..ఒకరు మృతి - విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ న్యూస్

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం సృష్టించింది. నలుగురి మధ్య తలెత్తిన విభేదాలతో బ్లేడ్​లతో దాడి చేసుకున్నారు. అందులో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి చేష్టలకు ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు.

blade-bach-halchal
blade-bach-halchal
author img

By

Published : Apr 2, 2021, 3:20 PM IST

Updated : Apr 2, 2021, 7:24 PM IST

అసలే ఆవారాలు.! ఆపై గంజాయి మత్తు.! ఇంకేముంది నడిరోడ్డుపైనే వీరంగం వేశారు. బ్లేడ్‌లతో రక్తం చిందించుకుంటూ స్థానికుల్ని బెంబేలెత్తించారు. బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు.. మితిమీరి రచ్చకెక్కాయి. గతేడాది యువకుల గ్యాంగ్‌వార్‌ మరువకముందే..వాంబేకాలనీకి చెందిన నలుగురు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు.. నడిరోడ్డుపై రెచ్చిపోయారు. పైపులరోడ్డు కూడలి నుంచి.. వాంబేకాలనీకి వెళ్లే మార్గంలోని దుర్గాబార్‌ సమీపంలో.. బ్లేడ్‌లతో పసర్పరం గాయపరుచుకున్నారు. నాగరాజు అలియాస్‌ పండు పీక తెగి బాగా రక్తస్రామమై చనిపోయాడు. మిగతా ముగ్గురు.. హుస్సేన్‌, రఫీ, కిశోర్‌బాబు కూడా గాయపడగా..వారిని పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

గతరాత్రి వంద రూపాయల విషయంలో తలెత్తిన వివాదమే కొట్లాటకు కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. వారి వివరాలు ఆరా తీస్తున్నారు. గంజాయిమత్తులో ఉన్నప్పుడు బ్లేడ్లతో దాడి చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం...రూ.100 కోసం దాడి..ఒకరు మృతి

ఇదీ చదవండి: ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు

Last Updated : Apr 2, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.