ఇద్దరూ వరసకు అన్నదమ్ములు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఇప్పటికే వివిధ జిల్లాలో వీరిపై కేసులు నమోదవగా పలు దఫాలు జైలుకు వెళ్లి వచ్చారు. వరుస దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న వీరిని ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీఐ మురళీకృష్ణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భీమారావు వెల్లడించారు.
రాయవరం మండలం వెదురుపాకకు చెందిన కట్టా సత్తిబాబుపై పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో 39 కేసులు నమోదయ్యాయని తెలిపారు. శివశంకర్ మీద 21, సత్తిబాబు మీద 18 కేసులు ఉన్నాయన్నారు. జిల్లాలోని పెదపూడి, ఇంద్రపాలెం, కోరింగ, అనపర్తి, ముమ్మడివరం, బిక్కవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని, వీరి వద్ద నుంచి 199 గ్రామల బంగారు, రూ.29,400 విలువైన 420 గ్రాముల వెండి, రూ.36వేలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంద్రపాలెంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో వస్తువులు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ చేశామన్నారు. గ్రామీణ సీఐ ఆకుల మురళీ కృష్ణ, పెదపూడి ఎస్సై నాగార్జునరాజు, ఏఎస్సైలు సూరిబాబు, శ్రీనివాసరావు, సిబ్బందిని ఎస్పీ నయీం అస్మీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: