RAPE ATTEMPT ON MINOR GIRL : మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఆటోడ్రైవర్, అతని స్నేహితుడిని ఇద్దరు యువకులు ప్రాణాలు తెగించి వెంబడించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద బాలిక ఆటో ఎక్కింది. బాలికపై కన్నేసిన కామాంధుడు.. ఆటోలో గ్యాస్ లేదని నమ్మించి ఉంగుటూరు వైపు మళ్లించాడు. వేరే వైపు వెళ్లడంతో భయభ్రాంతులకు గురైన బాలిక కేకలు వేసింది. వెంటనే ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు బాలిక గొంతునొక్కే ప్రయత్నం చేయగా.. ఆ సమయంలో అమ్మాయి కిందపడింది. అక్కడే పొలాల్లో పని చేస్తున్న రైతులు బాలిక కేకలు విని.. వచ్చి చూసే సరికి.. గాయాలపాలైంది. పారిపోతున్న ఆటోడ్రైవర్‌ని పట్టుకునేందుకు ఇద్దరు వ్యక్తులు బైక్పై వెంబడించారు. వదలకుండా ఆటో వెంటపడ్డారు. ఈ క్రమంలో బైక్ పైనుంచి పడి ఇద్దరికీ గాయాలయ్యాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ జాషువా మరియు గన్నవరం డీఎస్పీ విజయ్ పాల్ గారి నేతృత్వంలో గన్నవరం సీఎ మరియు సిబ్బంది మరియు హనుమాన్ జంక్షన్ సీఐ, ఉంగుటూరు ఎస్సై, వారి సిబ్బంది స్పెషల్ టీంగా నియమించి ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కేసులో ముద్దాయి అయిన సునీల్ సుమారు 6 నెలల కాలం నుండి బాలికతో స్నేహం కొనసాగిస్తూ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తున్నాడు. నిన్న బాలిక కాలేజీకి వెళ్తున్న సమయంలో కలిసిన సునీల్.. ఆటోలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. స్థానికులు స్పందించి ఆటోను ఆపారు. ఈ సమయంలో బాలిక ఆటో నుంచి దూకేసింది. మైనర్ బాలిక ముద్దాయితో ఉన్న స్నేహం గురించి గానీ.. ఇన్స్టాగ్రామ్ చాటింగ్ గురించి గానీ ఎటువంటి క్లూ ఇవ్వలేదు. బాలిక ఆమె తల్లి యొక్క సెల్ఫోన్ ఉపయోగిస్తూ.. ముద్దాయితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఉండేదని తెలిపారు.
పిల్లలకు సెల్ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని పోలీసులు సూచించారు. పిల్లలు ఎవరెవరితో చాట్ చేస్తున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ? అన్నది కొద్దిగా గమనించాలన్నారు. ఈ కేసులో బాలిక ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడం.. ముద్దాయికి దగ్గర స్నేహం కొనసాగించడం.. ముద్దాయితో ఒంటరిగా ప్రయాణము చేయడం వలన ఈ నేరం చేయడానికి ముద్దాయికి అవకాశం కలిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలు యొక్క ప్రవర్తనను గమనించాలని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి: