తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్‌పురా కాలనీకి చెందిన వివాహిత గొంతు కోసిన ఘటన కీలక మలుపు తిరిగింది. బ్లేడుతో వివాహితే గొంతు కోసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. తొలుత హత్యాయత్నంగా నమ్మించడానికి యత్నించినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఇంట్లో పనులు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. గతంలో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 2 నెలల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు వెల్లడించారు. 9 నెలల క్రితం కామారెడ్డి యువకుడితో ఆమెకు వివాహం జరిగింది.
ఇదీ చదవండి: