శ్రీకాకుళం జిల్లా నందిగాo మండలం పెద్ద తామరాపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మందికి గాయాలు అవ్వగా... అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తుండగా.. 21 మందికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. వీళ్లంతా బంగాల్ నుంచి కేరళ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: