kidnapped 3rd class student from the school: నెల్లూరు జిల్లా దుత్తలూరులో కావ్య అనే బాలికను.. ఓ మాయలేడి సినీఫక్కీలో కిడ్నాప్ చేసింది. ప్రాథమిక పాఠశాల మూడో తరగతి చదువుతున్న కావ్య రోజూలాగే బడికి వెళ్లింది. ఐతే.. మేనత్తనంటూ ఓ మహిళ పాఠశాలకు వెళ్లి కావ్యను పంపాలని కోరింది. నిజమేనని నమ్మి.. ఉపాధ్యాయులు పంపించారు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో.. అనుమానం వచ్చి తల్లిదండ్రులకు కబురు పంపారు. కావ్య తల్లిదండ్రులు ఏదో జరిగిందని అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగంతుకురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు.
ఇవీ చదవండి: