ETV Bharat / crime

భార్యభర్తల మధ్య మనస్పర్థలు.. పిల్లలను వాగులో పడేసిన తల్లి.. చివరకు..! - నదిలో పడి పిల్లలు మృతి

mother threw the children in the river: ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు. బాబుకు నాలుగేళ్లు. పాపకు ఆరునెలలు. అమ్మ తోడుంటే చాలు వారికి ఇంకేమీ అక్కర్లేదు. అంతకు మించి అర్థం చేసుకోలేని పసితనం. అటువంటి ఇద్దరు పిల్లలను కన్నతల్లే వాగులోకి విసిరేసింది. గమనించిన స్థానికులు వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ శివారులో జరిగింది.

mother threw the children in the river
mother threw the children in the river
author img

By

Published : Dec 27, 2022, 12:10 PM IST

mother threw the children in the river: భార్యభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలు ఏమీ తెలియని పసిపిల్లల చావుకు దారితీశాయి. నవ మాసాలు మోసి.. కనిపెంచిన తల్లి ఆ పిల్లలను వద్దు అనుకొని వాగులో విసిరేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా నాగారం సమీపంలోని చక్రనగర్‌తండాకు చెందిన అరుణ, మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్‌ భార్యాభర్తలు. వారికి కుమారుడు యువరాజు, కుమార్తె అనోన్య ఉన్నారు.

గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పుట్టింటికి వచ్చిన అరుణకు భర్త ఫోన్‌ చేసి ఉద్గీర్‌ వచ్చేయాలని చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె తల్లి గారి గ్రామం నుంచి బయలుదేరింది. దారిలో బాన్సువాడ శివారులోని వాగులో ఇద్దరు చిన్నారులను పడేసింది. చూసిన స్థానికులు వెంటనే వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. నిజామాబాద్‌ నుంచి ఆటోలో వస్తుండగా డ్రైవర్‌ తనపై అఘాయిత్యం చేయడంతో పిల్లలను వాగులో పడేసి పారిపోయానని అరుణ వారికి తెలిపింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా.. వాగు వద్ద ఆటో కానీ, డ్రైవర్‌ కానీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.