కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం కాలిపోయి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. పక్కనే సెల్ఫోన్, ఆధార్, బ్యాంకు పాసుబుక్ జీరాక్స్ కాపీలు దోరికాయి. వాటి ఆధారంగా మృతుడు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సన్నాలు గీతాకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడిది ఆత్మహత్యా...? లేకా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వైకాపా జిల్లా కార్యదర్శిపై దాడి... బంగారం, నగదు చోరీ