కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గొల్లపల్లిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలతో హత్య జరిగినట్లు తెలుస్తోంది.
గొల్లపల్లికి చెందిన కృష్ణారెడ్డి దంపతులు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రోకలిబండతో దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డి భార్య శ్రీలేఖను కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కృష్ణారెడ్డి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బద్వేలు ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
RAPE: బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితులపై కేసు నమోదు