తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పెద్ద హనుమాన్ మందిర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న సైకిల్ రిపేర్ షాప్‌లో మంటలు అంటుకుని పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణంలోకి మంటలు వ్యాపించాయి.
సైకిల్ షాప్‌లో యజమాని నిసార్ అహ్మద్‌కు చెందిన ఇంటి పత్రాలు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణంలో సుమారు రూ.10 లక్షల విలువైన సామగ్రి దగ్ధమైంది.
బాసిద్ హుస్సేన్ ఫర్నిచర్ దుకాణంలో సుమారు రూ. 4 లక్షల కట్టె సామగ్రి కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. వారు సమయానికి స్పందిస్తే పెద్ద ఆస్తి నష్టం వాటిల్లేది కాదని ఆరోపించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: