చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కార్తికేయపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కార్తికేయపురం గ్రామానికి చెందిన సుకన్య.. 2014లో కానిస్టేబుల్‌గా ఎన్నికైంది. ప్రస్తుతం తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుంది. ఐదేళ్ల క్రితం గ్రామానికి చెందిన ప్రసాద్‌తో వివాహమైంది. సుకన్య- ప్రసాద్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి పాపకు మూడేళ్లు ఉండగా.. రెండో పాపకు రెండు నెలలు క్రితమే జన్మనిచ్చింది. అనంతరం ఆపరేషన్ చేయించుకొని కార్తికేయపురంలోని అత్తగారి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటికే సుకన్య మృతిచెంది ఉండటంతో బంధువుల కన్నీరుమున్నీరుగా విలించారు.
పాప ఏడుస్తుండటంతో..
ఇంట్లో చిన్నారి ఏడుస్తుంటే గమనించన స్థానికులు.. తల్లి కోసం చుట్టుపక్కల చూశారు. ఈక్రమంలో ఇంటికి సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న సుకన్యను గుర్తించి కేకలు వేస్తూ.. గ్రామస్థులకు సమచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుకన్య ఆత్మహత్యకు గల కారణాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి..
పర పరుషులతో మాట్లాడబోనని రాసివ్వమన్నాడు.. అంగీకరించని భార్యను చంపబోయాడు..!