ETV Bharat / crime

సినీఫక్కీలో ఘరానా దొంగతనం-41 తులాల బంగారం, 7 కిలోల వెండి చోరీ - nizamabad district news

తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా బోధన్ బస్టాండ్​లో.. ఘరానా దొంగతనం జరిగింది. నగల వ్యాపారి నుంచి దుండగులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు.

ఘరానా దొంగతనం-
ఘరానా దొంగతనం
author img

By

Published : Aug 13, 2021, 8:26 PM IST

తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లా బోధన్ బస్టాండ్​లో.. నిన్న (గురువారం) రాత్రి సినీఫక్కీలో ఘరానా దొంగతనం జరిగింది. కాపుకాసి మరీ నగలవ్యాపారి నుంచి దుండగులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి దళపత్​ సింగ్​ నుంచి 41 తులాల బంగారం, 7 కిలోల వెండి, లక్ష నగదును దోచుకెళ్లారు. బోధన్​లోని దుకాణాలకు బంగారం, వెండి ఇచ్చి తిరిగి హైదరాబాద్​ వెళ్లడానికి బస్​ ఎక్కారు.

తన సీట్​లో బ్యాగ్​ను ఉంచి టికెట్​ తీసుకోవడానికి డ్రైవర్​ వద్దకు వెళ్లగానే... అక్కడే కాపుకాసిన దుండగులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. గ్రహించిన బాధితుడు.. బోధన్​ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. దొంగలముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఇదీ చదవండి:

Fake Challanas: 'ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం.. సొమ్మును రికవరీ చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.