ETV Bharat / crime

మహేశ్​ బ్యాంక్​ సర్వర్​ హ్యాకింగ్​ కేసులో మరింత పురోగతి... నలుగురు అరెస్ట్​ - దేశవ్యాప్తంగా ఖాతాదారులు

Mahesh Bank Hacking case: హైదరాబాద్‌లోని మహేశ్​ బ్యాంక్​ సర్వర్​ హ్యాకింగ్​ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో కనిపెట్టి పట్టుకుంటున్నారు. తాజాగా.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నలుగురిని అరెస్ట్​ చేశారు. వీళ్ల సహకారంతో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఖాతాదారులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Mahesh Bank Hacking case
Mahesh Bank Hacking case
author img

By

Published : Feb 8, 2022, 10:46 PM IST

Mahesh Bank Hacking case: హైదరాబాద్‌లోని మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించిన సైబర్‌ నేరస్థులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఉన్న రాష్ట్రాలను ఎంచుకున్నారు. మహేశ్‌బ్యాంక్‌ నుంచి రూ.12.90కోట్లు కాజేసిన నిందితులు.. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, యూపీ, మణిపూర్‌, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాలతో పాటు దిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌లోని ప్రైవేటు, కార్పొరేటు బ్యాంకుల్లోని ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్​..

నిందితులను పట్టుకునేందుకు రెండు వారాల నుంచి శ్రమిస్తున్న పోలీసులు తాజాగా దిల్లీలో ఇద్దరు నైజీరియన్లు ఛింక్‌హిలు, ఒక్కేసోలమన్, కేరళవాసి రమ్‌షాద్, పార్వతీపురం నివాసి అలెక్స్‌పాండీలను అరెస్ట్‌చేశారు. వీరితో ఇప్పటివరకు సైబర్​క్రైం పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. రూ.3.15కోట్లు నగదు సైబర్‌ నేరస్థులు ఖాతాల్లోకి జమచేసినా... వాటిని విత్‌డ్రా చేసుకోకుండా ఆపేశారు. ఇక నిందితులకు సహకరించిన వారున్నారన్న సమాచారంతో మణిపూర్‌, త్రిపుర, కోల్‌కతా, గుజరాత్‌లతో బ్యాంక్‌ ఖాతాదారులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కమీషన్‌కు ఆశపడి నైజీరియన్లతో సంబంధాలు..

మహేశ్‌బ్యాంక్‌ నుంచి నగదు కొల్లగొట్టేందుకు పథకం వేసిన నైజీరియన్లు.. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, కేరళలో మాత్రమే ఖాతాదారులను సమకూర్చునేందుకు కమీషన్‌ ఇచ్చి ఏజెంట్లను కుదుర్చుకున్నారు. దిల్లీ, బెంగళూరులో ఇద్దరు, కేరళలో ఒక వ్యక్తి, హైదరాబాద్‌లో ఇద్దరిని ఎంపిక చేసుకున్నారు.

  • దిల్లీలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నైజీరియన్‌ యువతి ఛింక్‌హిలు, రంజిత్‌ విహార్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఒక్కే సోలమన్, గజియాబాద్‌కు చెందిన అనిల్‌ మాలిక్‌.. దిల్లీ, కోల్‌కతా, మణిపూర్, త్రిపుర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉంటున్న వారిని ఎంపిక చేశారు.
  • హైదరాబాద్‌లో ఉంటున్న కోలిశెట్టి సంపత్‌కుమార్, మేడవరపు నవీన్‌.. నైజీరియన్ల వద్ద కమీషన్‌ తీసుకుని ఖాతాలు సమకూర్చారు. వారితో నాలుగైదు రోజులు కలిసి తిరిగారు. సంపత్, నవీన్‌ కర్నూలుకు చెందిన బండి అబ్దుల్‌ రసూల్, విజయవాడలో ఉంటున్న పి.పవన్‌రాజు, పార్వతిపురం వాసి అలెక్స్‌పాండీతో మాట్లాడి నైజీరియన్లకు సహకరించారు.
  • బెంగళూరులో ఉంటున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి ఇమ్మాన్యుయెల్‌.. అక్కడే ఉంటూ ఫార్మసీ చదివి మధ్యలో మానేసిన జములుతో మాట్లాడి ఒక ఖాతా కావాలని కోరాడు. జములు తన ప్రేయసి షిమ్రాంగ్‌ ఖాతాను సమకూర్చాడు.
  • హైదరాబాద్‌లో ఉంటున్న ఓ నైజీరియన్‌ హ్యాకర్ల నుంచి సమాచారం రాగానే కేరళలోని మళ్లపురం జిల్లాకు చెందిన రమ్‌షాద్‌తో మాట్లాడాడు. అక్కడ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్న రమ్‌షాద్‌.. నైజీరియన్లు నగదు బదిలీ చేయాలనుకున్న ఖాతాలను సమకూర్చాడు.

మహేశ్‌బ్యాంక్‌ సైబర్‌దాడి కేసులో ప్రధాన నిందితులకు సహాయకులుగా ఉన్నవారంతా నైజీరియన్లేనని సైబర్‌క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్ట్‌ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని దిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో ఉన్న ప్రత్యేకబృందాల సభ్యులకు ఉన్నతాధికారులు సూచించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.