విశాఖ సముద్ర తీరాన కొండపై ఉన్న సత్యభామ శిలకు దర్శించుకునేందుకు భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం వెలసిన సత్యభామ శిలకు... కనుమ రోజున నైవేధ్యం పెట్టడం సంప్రదాయంగా వస్తుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. విశాఖకు ఉక్కు కర్మాగారం, గంగవరం పోర్టు నిర్మాణం కోసం తాము ఇక్కడి నుంచి వెళ్లిపోయామని చెప్పారు. సంప్రదాయంగా వస్తున్న కార్యక్రమాన్ని కొనసాగించడానికి తాము కనుమ రోజున ఈ ఆలయానికి వస్తామన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి గాజువాక నుంచి రావల్సి వస్తుందని ... కానీ సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇన్ని ఇబ్బందులు పడి వచ్చినప్పటికి తమకు ఏడాదిలో ఒక్కరోజే దర్శనానికి అనుమతిస్తున్నారని భక్తులు ఆరోపించారు. కొండపైకి వెళ్లడానికి సరైన ఏర్పాట్లు లేనందున ఇబ్బంది పడుతున్నామన్నారు. దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే తమకు ఇక్కట్లు తప్పుతాయన్న అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేశారు.
విశాఖలోని ఆ దేవాలయం... ఆ ఒక్క రోజే దర్శన భాగ్యం... - సంవత్సరంలో ఒక్కరోజే అమ్మ దర్శనం వార్తలు
విశాఖ సముద్ర తీరాన కొండపై ఉన్న సత్యభామ శిలను దర్శించుకోవడానికి భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. సరైన సదుపాయం లేక కొండపైకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కనుమ రోజు అమ్మవారికి నైవేధ్యం పెట్టడం ఇక్కడి సంప్రదాయం..దీనికి సంవత్సరంలో ఒక్కరోజే అవకాశం కల్పిస్తున్నారు గంగవరం పోర్టు, ఉక్కు కర్మాగారం అధికారులు.