ETV Bharat / city

మా ఇంటి బాధ్యతలా.. విశాఖ నగరానికి వన్నెలద్దుతాం - విశాఖ మేయర్​

విశాఖ మహిళా మేయర్​, కమిషనర్లు నగరాన్ని రానున్నకాలంలో ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారనే ప్రణాళికలపై 'ఈనాడు'తో పంచుకున్నారు. అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వారు అనుసరించనున్న మార్గాలు, అందుకు వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను తెలియజేశారు.

vizag mayor on development plans for the city
మా ఇంటి బాధ్యతలా.. విశాఖ నగరానికి వన్నెలద్దుతాం
author img

By

Published : Apr 5, 2021, 11:50 AM IST

ప్రజల సంతృప్తే లక్ష్యంగా ముందుకు వెళ్తాం..

ట్రాఫిక్‌ సమస్యపై లోతుగా అధ్యయనం చేయిస్తాం. అదనంగా 5 ఫ్లైఓవర్లు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముడసర్లోవ పార్కు విశాఖకే వన్నె తెచ్చెలా ప్రాధాన్యమిస్తాం. మురికివాడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. 9న పాలకవర్గ సమావేశం పెడుతున్నాం. మా పాలకవర్గం పాలనాకాలం పూర్తయ్యేలోపు అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తక్కువ కాకుండా నిర్ణయాలుంటాయి.

- గొలగాని హరి వెంకటకుమారి, మేయర్‌

  • పర్యటనల్లో ఎక్కడికక్కడే తీసుకునే నిర్ణయాలపై..

కమిషనర్‌: పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై స్పాట్‌లో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ భూసమస్యలు లాంటివి కొంత టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా అనుభవంలో క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు అప్పటికప్పుడు పరిష్కరించే సమస్యలే 90శాతం ఉంటాయి.

మేయర్‌: ప్రజల కష్టాలు తీరడం ప్రధానం. కమిషనర్‌, అధికారులతో చర్చించి వీలైనన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూస్తాం. దీర్ఘకాలికంగా చేయాల్సినవి మేమిద్దరం కూర్చుని చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం.

  • మీ ఇద్దరి జోడీపై..

మేయర్‌: బ్రహ్మాండంగా పనిచేస్తాం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం. చక్కటి పాలనలో ఆడవారు తీసిపోరని నిరూపించుకుంటాం.

కమిషనర్‌: స్వచ్ఛ నగరానికి కావాల్సిన పూర్తి సహకారం మా నుంచి పాలకవర్గానికి అందిస్తాం. ప్రజలు గర్వించే స్థాయికి నగరాన్ని తీసుకెళ్తాం.

  • మీలో ఒకర్ని గురించి మరొకరు చెప్పమంటే..

కమిషనర్‌: క్షేత్రస్థాయి పర్యటనల్లో మేయర్‌ స్పందించే తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. అవగాహనతో మాట్లాడినట్లు నాకనిపించింది. ఈ నగరాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాల్ని త్వరగా ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మేయర్‌: సృజన నగరానికి వచ్చినప్పటి నుంచే ఆమె అంటే గౌరవం. మేయర్‌ అయ్యాకకూడా అభిమానం పోలేదు. నన్ను ఓ తోబుట్టువులా చూస్తున్నారు. సహకరిస్తున్నారు.

  • ప్రజల నమ్మకాన్ని మరింత ఇనుమడించేలా..

కమిషనర్‌: ఇప్పుడు జీవీఎంసీపై మరింత జవాబుదారీతనం పెరిగిందనే అనాలి. ప్రజల ఆకాంక్షలకు చేరువ అవడానికి కార్పొరేటర్ల వ్యవస్థ చక్కగా ఉపయోగపడుతుంది.
మేయర్‌: నగరం సురక్షితంగా ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారు. ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి వారికి యోగ్యమైన నగరాన్ని అందించాలనే లక్ష్యముంది. ప్రజలు ఎన్నుకున్నారు, వారికోసమే కష్టపడేందుకు పాలకవర్గం ఉత్సాహంగా ఉంది.

పాలకవర్గం, అధికారుల సమన్వయంతో పనిచేస్తాం..

నగరవ్యాప్తంగా ఏడాదిన్నరలో పార్కులు, రోడ్లు, నడకబాటల్ని చక్కగా తీర్చిదిద్దాలనేది సీఎం లక్ష్యంగా పెట్టారు. పోలవరం పైపులైను తెచ్చుకుని నగరానికి మేలు చేయడం, స్వచ్ఛసర్వేక్షన్‌ ర్యాంకు మెరుగు పరచుకోవడం ప్రాధాన్యంగా ఉన్నాయి.

- డాక్టర్‌ జి.సృజన, కమిషనర్‌

  • పాలకపక్షం, అధికారవర్గం..ఈ సమఉజ్జీల సద్వినియోగం ఎలా..

మేయర్‌: అధికారవర్గానికి గొప్ప ప్రాధాన్యం ఉంది. వారి సూచనలు కీలకం. ప్రజల ఆకాంక్షలు, అధికారుల అభిప్రాయాలు తీసుకుని.. కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకునేలా ముందుకెళ్తాం.
కమిషనర్‌: ఇదివరకూ ప్రత్యేకాధికారుల అనుభవంతో, మాకున్న క్షేత్రస్థాయి పరిశీలనలతో కలిసి నిర్ణయాలు తీసుకునేవాళ్లం. పాలకవర్గంలో చూస్తే.. వ్యాపారులు, డాక్టర్‌, క్రీడాకారులు, ఎంబీఏ చదివినవారు, గృహిణులు ఇలా.. చాలా రంగాలకు చెందిన కార్పొరేటర్లున్నారు. ఒక సమస్య పరిష్కారానికి ఎక్కువ కోణాల్లో చూడటం వీరితో సాధ్యమవుతుంది.

  • ప్రజలు సమస్యల్ని తెలిపేందుకు కొత్త మార్గాలేమన్నా..

కమిషనర్‌: ఇప్పటికే ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌ స్పందన లాంటివి తెచ్చాం. సచివాలయాల్లో రోజూ స్పందన తీసుకొచ్చాం. కార్పొరేటర్లతో కలిసి మరిన్ని మంచి మార్గాలు అన్వేషిస్తాం.
మేయర్‌: పని తొందరగా అవ్వాలనే తాపత్రయం ప్రజల్లో ఉంటుంది. తప్పులేదు. వారి అంచనాలకు తగ్గట్లే తరచూ డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమం పెడతాం. క్షేత్రస్థాయి లోపాల్ని సవరించుకుంటాం. ప్రస్తుతం సమీక్షలు జరుగుతున్నాయి.

  • పాలకవర్గంలో మహిళలే ఎక్కువ. ప్రత్యేక మార్కుపై..

మేయర్‌: మహిళా మేయర్‌గా నా బాధ్యత మరింత పెరిగింది. మహిళా కార్పొరేటర్లు చాలా చురుగ్గా ఉన్నారు. పోటీపడి శ్రమిస్తారనే నమ్మకం నాకుంది. జీవీఎంసీ మీద, చట్టాలమీద మరింత మంచి అవగాహనకోసం ఉన్నతాధికారులతో తరగతులు కూడా నిర్వహిస్తాం. ప్రజా సమస్యలు మావి అనే ఉద్దేశంతోనే పనిచేస్తాం.
కమిషనర్‌: మహిళలు సున్నితంగానూ ఉంటారు, అలాగే సరైన నిర్ణయాలు తీసుకుని పనిచేయించే సత్తానూ కలిగి ఉంటారు. అదే మా శక్తి. మహిళలకు సమయపాలన, సకాలంలో పనులు చేసుకెళ్లడం, పరిస్థితులకు తట్టుకోగలగడం, సమన్వయంతో ముందుకెళ్లడం లాంటివి సహజంగా వచ్చాయి.

  • అధికారులు, సిబ్బందిలో అలసత్వం పోవడానికి..

మేయర్‌: ప్రతీ కార్పొరేటర్‌.. అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. అందరూ సమావేశమై కలిసికట్టుగా నగరాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు వేసుకుంటాం. వారానికి 5రోజుల పాటు వార్డు విజిట్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మంచినీరు, పారిశుద్ధ్యం, రోడ్లు లాంటి మౌలిక వసతులపై వెంటనే దృష్టిపెడతాం. ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వం.
కమిషనర్‌: ప్రజల జీవన విధానం మెరుగుపడాలంటే మొదటి బాధ్యత జీవీఎంసీదే. దీనికి అనుగుణంగా పర్యటనలు చేస్తాం. జీవీఎంసీ సిబ్బంది మరింత బాధ్యతగా ఉండేలా, ప్రజల్లో సంతృప్తిపాళ్లు పెరిగేలా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

ఇదీ చదవండి :

'మోదీ, షా చెప్పినట్లు చేస్తే సీఎంకు ప్రజా ఆగ్రహం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.