విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం వ్యూహాత్మక అమ్మకం కోసం నియమించే సలహాదారులను అడ్డుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. కరోనా కష్ట కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షల మందికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు అందిందని కార్మిక నేతలు చెప్పారు. పరిశ్రమ ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. అలాంటి పరిశ్రమను అమ్మేస్తాం, మూసేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు ప్రజలు బానిసలు కాదని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని, ఇప్పటికైనా కేంద్రం తన నిరంకుశ ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. ప్రజా పోరాటానికి భయటపడి గుత్తేదారులెవరూ పరిశ్రమను కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు.
ఇదీచదవండి.