రాష్ట్రంలోని చిన్నారులు చెస్ క్రీడపై ఆసక్తి కనబరుస్తూ.. రాణిస్తుండటం ఒక పరంపరగా వస్తోంది. చిన్నతనం నుంచే చెస్‌లో తర్ఫీదు పొందిన కొనేరు హంపి వంటి వారు ఆ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఈనాటి తరం కూడా చెస్‌లో తమ మేధస్సును చాటుతూ ఔరా అనిపిస్తున్నారు. విశాఖకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక కొలగట్ల అలన మీనాక్షి... చదరంగంలో చిచ్చర పిడుగులా దూసుకెళ్తోంది. మూడో తరగతి చదవుతున్న ఈ చిన్నారి... రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుస్తూ తన విజయప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తోంది.
ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు
కామన్వెల్త్ చెస్ చాంఫియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న మీనాక్షి... ఆరో స్థానంలో నిలించిది. గతేడాది శ్రీలంకలో నిర్వహించిన ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలను సాధించింది. ఒక బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న 15 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ నెల నాలుగు నుంచి 11 వరకు దిల్లీలో జరిగిన వెస్ట్రన్ ఆసియన్ జూనియర్ అండ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో ఆమెను నాలుగు పతకాలు వరించాయి.
చిన్నతనంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న మీనాక్షి విజయాల పట్ల తల్లి అపర్ణతో పాటు ఇతర చెస్ క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే అనేక ప్రపంచ రికార్డులును నెలకొల్పుతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు చదరంగం, మరోవైపు చదరంగంలోనూ రాణిస్తున్న మీనాక్షి మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని చెస్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి :