ETV Bharat / city

ఊపిరి నిలిపే 'ఉక్కు'ని కాపాడండి! - మహారాష్ట్రకు వెళుతున్న ట్యాంకర్స్​పై విశాఖ ఉక్కు పరిశ్రమ పోస్టర్లు న్యూస్

కొవిడ్‌ బాధితులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్‌ అందిస్తూ... ప్రాణదాతగా నిలుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ కార్మికులు, నిర్వాసితులు వినూత్న ప్రచారం సాగించారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఆక్సిజన్​ రైలు, ట్యాంకర్ల చుట్టూ ఉక్కు నినాదాలతో కూడిన పోస్టర్లను అంటించారు.

vishaka steel plant posters on oxygen tankers

author img

By

Published : Apr 24, 2021, 8:57 AM IST

మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్‌ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమకు గురువారం వచ్చి వెళ్లిన రైలుతో పాటు, ట్యాంకర్ల చుట్టూ ఉక్కు నినాదాలతో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కార్మికులు, నిర్వాసితులు అతికించారు. ‘సేవ్‌ విశాఖ స్టీల్‌, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు, ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి’ అంటూ నినాదాలు వాటిపై రాశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఉక్కు పోరాట తీవ్రత తెలిసేలా, కేంద్రం దిగి వచ్చేలా ఈ ప్రయత్నం చేసినట్లు పోరాట కమిటీ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్​వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.